Corona – Osmania University: ఈనెల 8 నుంచి ఓయూ హాస్టల్స్ బంద్.. మళ్లీ ఎప్పుడు ఓపెన్ అంటే..!

|

Jan 07, 2022 | 11:03 AM

Corona - Osmania University : కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు అలర్ట్ అయ్యారు. యూనివర్సిటీలోని హాస్టళ్లను

Corona - Osmania University: ఈనెల 8 నుంచి ఓయూ హాస్టల్స్ బంద్.. మళ్లీ ఎప్పుడు ఓపెన్ అంటే..!
Follow us on

Corona – Osmania University : కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు అలర్ట్ అయ్యారు. మరోవైపు సంక్రాంతి పండుగను కూడా పరిగణలోకి తీసుకుని యూనివర్సిటీలోని హాస్టళ్లను ఈనెల 8వ తేదీ నుంచి మూసివేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు హాస్టల్స్ చీఫ్‌ వార్డెన్‌ శ్రీనివాస్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. యూనివర్సిటీ అధికారుల ఆదేశాల మేరకు 8వ తేదీన మధ్యాహ్న భోజనం తర్వాత మెస్‌లను కూడా మూసివేస్తామని తెలిపారు. విద్యార్థులు హాస్టల్‌ గదుల్లోని తమ సామాన్లను వెంటతీసుకెళ్లాలని సూచించారు. హాస్టళ్లను తిరిగి ప్రారంభించే తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో గతేడాది అక్టోబర్‌లో జరిగిన డిగ్రీ కోర్సుల వన్‌టైమ్‌ చాన్స్, బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బీఏ, బీబీఏ కోర్సుల బ్యాక్‌లాగ్, వన్‌టైమ్‌ చాన్స్‌ ఫలితాలు.. బీఎస్సీ, బీఏ ఒకేషనల్, బీకాం ఆనర్స్, వార్షిక పరీక్షల ఫలితాలను ప్రకటించినట్లు యూనివర్సిటీ కంట్రోలర్‌ శ్రీనగేశ్‌ తెలిపారు. ఇక రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూలును కూడా యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. సీపీజీఈటీ–2021లో భాగంగా ఈ నెల 6 నుంచి ఈ నెల 10వరకు చివరి విడత వెబ్‌కౌన్సెలింగ్‌ జరగనున్నట్లు కన్వీనర్‌ ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు. ఎన్‌సీసీ, దివ్యాంగులు, సీఏపీ అభ్యర్థులు ఈ నెల 10న నేరుగా ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్‌ కార్యాలయంలో జరిగే సర్టిఫికెట్ల వెరి ఫికేషన్‌కు హాజరు కావాలన్నారు. అలాగే ఈ నెల 12నుంచి 15వరకు వెబ్‌ ఆప్షన్‌ ఇవ్వాలని, 16న ఎడిటింగ్, 19న వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన అభ్యర్థుల చివరి జాబితాను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

Also read:

Find It if Genius: ఈ ఫోటోలో కనిపిస్తున్నది కుక్క? పిల్లి?.. వీడియో చూడకుండా చెప్తే మీ అంత ‘తోపు’ లేనట్లే..

Aliens News: భూమిపై ఏలియన్స్ న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాయా? ఆ వీడియోలో ఉన్నదేంటి?

100 Momos Challenge: వామ్మో.. ‘భీమిలి కబడ్డి’లో ధన్‌రాజ్ లాగే కుమ్మేసిందిగా.. కానీ చివరికి..