Viral Video: ఈ ఫోటోలో కనిపిస్తున్నది కుక్క అనుకుంటున్నారా? వీడియో చూస్తే అసలు విషయం మీకే తెలుస్తుంది..!

Find It if Genius: ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయంటారు. ఎందుకంటే.. మన కంటికి కనిపించిన దృశ్యం ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. ఉదాహరణకు ఎండమావుల గురించి చెప్పుకోవచ్చు.

Viral Video: ఈ ఫోటోలో కనిపిస్తున్నది కుక్క అనుకుంటున్నారా? వీడియో చూస్తే అసలు విషయం మీకే తెలుస్తుంది..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 07, 2022 | 11:17 AM

Find It if Genius: ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయంటారు. ఎందుకంటే.. మన కంటికి కనిపించిన దృశ్యం ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. ఉదాహరణకు ఎండమావుల గురించి చెప్పుకోవచ్చు. రోడ్డుకు అల్లంత దూరంలో ఎండమావులను చూస్తే నీళ్లు ఉన్నట్లే కనిపిస్తాయి. కానీ వాస్తవానికి అది నిజం కాదు. ఇలాంటి విషయం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రపంచ వ్యాప్తంగా ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. అక్కడ చూడటానికి ఒకలా కనిపిస్తున్నప్పటికీ.. వాస్తవంలో మాత్రం మరోటి ఉంది. మరి వాస్తవం ఏంటనేది గ్రహించాలంటే బుర్రకు పని చెప్పాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ వీడియోలో ఉన్న దృశ్యం అందరినీ పచ్చోళ్లను చేసేస్తోంది. మరి ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వైరల్ వీడియోలో తొలుత చాలా ఇళ్లు ఉన్నట్లుగా కనిపిస్తుంటుంది. తర్వాత కెమెరా యాంగిల్‌ను జూమ్ చేస్తే ఓ ఇంటి పైకప్పుపై జంతువు ఉన్నట్లుగా కనిపిస్తుంది. మరింత జూమ్ చేసి చూస్తే.. క్రమంగా పిక్చర్ క్లియర్ అవ్వడం మొదలవుతుంది. ఇలా జూమ్ చేసిన తరువాత ఇంటి పైకప్పుపై కుక్క తల ఉన్నట్లుగా స్పష్టం అవుతుంది. అదేంటి.. కుక్క తల మాత్రమే ఉందని సందేహపడే లోపు షాకింగ్ దృశ్యం కనిపించింది. అదంతా వట్టి భ్రమే అని తేలిపోయింది. అక్కడ ఉన్నది కుక్క కాదు.. పిల్లి అని క్లారిటీ వచ్చింది. అవును.. పిల్లి అటువైపు తిరిగి ఉండటం, దాని వెనుక భావంతో మచ్చలు ఉండటంతో అచ్చం కుక్క తలను పోలినట్లు కనిపించింది. నిజంగా ఈ వీడియో చూసిన వారికి ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం అని చెప్పవచ్చు. ఇక ఆ దృశ్యాన్ని ఫోటోలో చేసి కనిపెట్టమంటే మాత్రం కష్టమే అని చెప్పాలి.

అయితే, ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌హాగ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘‘కుక్క లేదా పిల్లి… ఇందులో మీకు ఏం కనిపిస్తోంది?’’ అనే క్యాప్షన్‌ పెట్టారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒక్కరోజులోనే 56వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు. ‘ఈ వీడియో చాలా షాకింగ్ గా ఉంది. మొదట నేను కూడా కుక్క ఉంది అనుకున్నాను.’ అని కామెంట్స్ పెడుతున్నారు. ఇలా నెటిజన్లంతా తమదైన స్టైల్‌లో రెస్పాండ్ అవుతున్నారు. మరెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

View this post on Instagram

A post shared by ViralHog (@viralhog)

Also read:

Aliens News: భూమిపై ఏలియన్స్ న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాయా? ఆ వీడియోలో ఉన్నదేంటి?

100 Momos Challenge: వామ్మో.. ‘భీమిలి కబడ్డి’లో ధన్‌రాజ్ లాగే కుమ్మేసిందిగా.. కానీ చివరికి..

Sampreeti Yadav: గూగుల్‌లో మరో భారతీయ ఆణిముత్యం.. ఈ యువతి వేతనం కోటీపైనే..!