AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Admissions: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఒకే పోర్టల్ ద్వారా అన్ని కాలేజీల ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇంటర్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఒకే ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా డిగ్రీలో ఏ కోర్సులోనైనా అడ్మిన్‌ పొందేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు డిగ్రీ కళాశాలల ఆన్‌లైన్ ప్రవేశాల మాడ్యూల్ (OAMDC) అనే వెబ్‌సైట్‌ను రూపొందించింది..

Admissions: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఒకే పోర్టల్ ద్వారా అన్ని కాలేజీల ప్రవేశాలు
AP OAMDC Degree Admissions
Srilakshmi C
|

Updated on: May 18, 2026 | 9:33 AM

Share

అమరావతి, మే 18: 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్, డిప్లొమా, డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం దీనిని తీసుకురానుంది. ఏపీ ప్రభుత్వం ఒకే ఆన్‌లైన్ వేదిక కింద దీనిని ప్రవేశపెట్టనుంది. డిగ్రీలో ప్రవేశాలకు వేర్వేరు దరఖాస్తులు దాఖలు చేయడానికి బదులుగా విద్యార్థులు ఒకేసారి నమోదు చేసుకుని, కోర్సులను ఎంపిక చేసుకుని, ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రవేశాలను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. ఆధార్ అనుసంధానం వల్ల ఎలాంటి ఫిజికల్‌ సర్టిఫికెట్ల అవసరం లేకుండా మొత్తం ఆన్‌లైన్‌ విధానంలోనే మరింత వేగంగా అడ్మిషన్లు పొందొచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కలిగిన డిగ్రీ కళాశాలలు, ప్రైవేట్ ఎయిడెడ్ – అన్‌ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలలో వృత్తియేతర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో (BA, B.Com, B.Sc., BBA, BCA వంటి మొదలైన) ప్రవేశాలను సులభతరం చేస్తుంది. 2026-27 విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌ సహా ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది.

విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్‌ను ఉపయోగించి OAMDC పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ తర్వాత ఫీజు చెల్లించాక అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. చాలా వెరిఫికేషన్‌లు డేటా ఇంటిగ్రేషన్ ద్వారా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నప్పటికీ సందేహాలు ఉన్న విద్యార్ధులు హెల్ప్ లైన్ సెంటర్లను (HLCలు) సందర్శించవచ్చు. సర్లిఫికెట్ల వెరిఫికేషన్‌ తర్వాత విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవడానికి ‘వెబ్ ఆప్షన్స్’ ను ఉపయోగించాలి. అభ్యర్థి మెరిట్, కేటగిరీ, వారు ఎంచుకున్న ఆప్షన్ల ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుంది. అలాట్‌మెంట్ లెటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని గడువులోగా సంబంధిత కాలేజీలో స్వయంగా రిపోర్ట్ చేస్తే సరి.. మీ అడ్మిషన్‌ పూర్తయినట్లే. OAMDC అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ జూన్‌ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..