Oil India Recruitment: నవరత్నాల్లో ఒకటైన ఆయిల్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 535 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల నియామకం కోసం ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. వచ్చే నెల 23తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* మొత్తం 535 ఖాళీలకు గాను ఎలక్ట్రిషియన్ (38), ఫిట్టర్ (144), మెకానిక్ మోటర్ వెహికిల్ (42), మెషనిస్ట్ (13), మెకానిక్ డీజిల్ (97), ఎలక్ట్రానిక్స్ మెకానిక్ (40), బాయిలర్ (08), టర్నర్ (04), డ్రాగ్ట్స్‌మెన్ సివిల్ (08), ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (81), సర్వేయర్ (05), వెల్డర్ (06), ఐటీఅండ్‌ఎస్‌ఎమ్/ఐసీటీఎస్‌ఎమ్/ఐటీ (05)లతో 44 ఇతర ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి.. పదో తరగతి నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు సెప్టెంబర్ 23,2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంచుకుంటారు. ఎస్‌సీ/ఎస్టీలతో పాటు దివ్యాంగులకు 40 శాతం, ఇతరులు 50 శాతం మార్కులు అర్హతా నిర్ణయించారు.
* ఎంపికైన అభ్యర్థులు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 24, 2021న ప్రారంభం కాగా, సెప్టెంబర్ 23, 2021తో ముగియనుంది.
* నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
* అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Income Tax Returns: మీ బంగారం మీరు అమ్ముకున్నా టాక్స్ కట్టాల్సిందే..ఎంత పన్ను కట్టాలో తెలుసుకోండి!
Vizag: దండిగా సొమ్ములిస్తుంది అనుకుంటే.. సొమ్మసిల్లేలా చేస్తోన్న ట్యూనా చేప.. కేజీ రూ.50కే
Keerthy Suresh: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటోన్న మహానటి.. సమంత బాటలోనే కీర్తి సురేష్.