NTRO Recruitment 2023: ఇంజీనీరింగ్‌ నిరుద్యోగులు ఇది మీకోసమే! నెలకు రూ.1,77,500ల జీతంతో 182 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌.. 182 ఏవియేటర్‌ 2, టెక్నికల్‌ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు..

NTRO Recruitment 2023: ఇంజీనీరింగ్‌ నిరుద్యోగులు ఇది మీకోసమే! నెలకు రూ.1,77,500ల జీతంతో 182 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
NTRO Recruitment 2023

Updated on: Jan 02, 2023 | 5:57 PM

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌.. 182 ఏవియేటర్‌ 2, టెక్నికల్‌ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కంప్యూటర్ అప్లికేషన్‌/సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌/సాఫ్ట్‌వేరఱ్‌ సిస్టమ్స్‌/కంప్యూటర్‌ టెక్నాలజీ/డేటా సైన్స్‌/బిగ్‌ డేటా అనలిటిక్స్‌/ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌/మెషిన్ లెర్నింగ్/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/సైగర్‌ సెక్యూరిటీ/ఇన్పర్మేషన్‌ సైన్స్/డేటా సైన్స్‌ అండ్‌ స్పాటియల్‌ అనలిటిక్స్‌/జియో ఇన్ఫర్మేటిక్స్‌/మ్యాథమెటిక్స్‌/అప్లైడ్‌ మ్యాథమెటిక్స్‌/సైబర్‌ లా అండ్‌ ఇన్ఫర్మేషన్ సెక్యురిటీ/జియోమ్యాటిక్స్‌ తదితర స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 21, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఏవియేటర్‌ పోస్టులకైతే నెలకు రూ.56,100ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నెలకు రూ.44,900ల నుంచి రూ.1,42,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.