
న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ).. 300 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్/పవర్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ కమ్యునికేషన్ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే కనీసం ఏడేళ్లపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో జూన్ 2, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.