NTPC Recruitment: బీటెక్ విద్యార్థుల‌కు ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతోంది.. అప్లై చేశారా.?

| Edited By: Anil kumar poka

Jun 04, 2021 | 3:14 PM

NTPC Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ నేషన‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వర్ కార్పొరేష‌న్ తాజాగా ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇంందులో భాగంగా ప‌లు ఇంజినీరింగ్ విభాగాల్లో పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

NTPC Recruitment: బీటెక్ విద్యార్థుల‌కు ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతోంది.. అప్లై చేశారా.?
Ntpc
Follow us on

NTPC Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ నేషన‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వర్ కార్పొరేష‌న్ తాజాగా ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇంందులో భాగంగా ప‌లు ఇంజినీరింగ్ విభాగాల్లో పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ఖాళీల‌ను గేట్ 2021 స్కోర్ ఆధారంగా ఎంపిక చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ఈ నెల 10వ తేదీతో ముగిసిపోనుంది.. ఈ నేప‌థ్యంలో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ విభాగాల్లో పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నున్న ఖాళీల‌కు విద్యార్హ‌త‌గా సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేయాలి. 65 శాతం క‌నీసం మార్కులు సాధించాలి.

* మెకానిక‌ల్ ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీల‌కు సంబంధిత విభాగంలో 65 శాతం మార్కుల‌తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

* ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పోస్టుల‌కు సంబంధిత విభాగంలో 65 శాతం మార్కుల‌తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

* ఇన్‌స్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్ పోస్టుల‌కు సంబంధి విభాగంలో 65 శాతం మార్కుల‌తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ మే 21 నుంచి ప్రారంభమ‌వుతుండ‌గా.. జూన్ 10ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 280 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నున్నారు. గేట్ 2021లో అర్హ‌త సాధించిన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు.

* అర్హ‌త‌, అనుభ‌వం ఉన్న అభ్య‌ర్థులు ఎన్టీపీసీ అధికారిక వెబ్‌సైట్ ntpccareers.net లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Tirumala News: టీటీడీలో సమ్మెలు, నిరసనలు, ఆందోళనలపై నిషేధం పొడిగింపు.. ఎప్ప‌టివ‌ర‌కు అంటే

CCIL Recruitment 2021: సిమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

TS EAMCET 2021: టీఎస్ ఎంసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..?