నిరుద్యోగులకు సువర్ణావకాశం.. 3479 టీచర్ పోస్టులు.. మే31 చివరి తేదీ.. దరఖాస్తు చేసుకోండి ఇలా..?

|

May 17, 2021 | 6:47 PM

eklavya model school recruitment- 2021: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో 3479 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు సువర్ణావకాశం.. 3479 టీచర్ పోస్టులు.. మే31 చివరి తేదీ.. దరఖాస్తు చేసుకోండి ఇలా..?
Model School Recruitment
Follow us on

eklavya model school recruitment- 2021: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో 3479 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పెంచింది. మొదట జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 30 చివరి తేదీ. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA ) దరఖాస్తు పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు 2021 మే 31 లోగా దరఖాస్తు చేయొచ్చని కొద్దిరోజుల క్రితం వెల్లడించింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3479 పోస్టుల్ని భర్తీ చేస్తోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. తెలంగాణ, అంధ్రప్రదేశ్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 262 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 117 పోస్టులు ఉన్నాయి. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ స్కూళ్లలో జీత భత్యాలు కూడా భారీగానే ఉంటాయి. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://tribal.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు ఒక్కసారి నోటిఫికేషన్ చదివితే మంచిది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ https://recruitment.nta.nic.in/WebinfoEMRSRecruitment/ లో అప్లై చేయాలి. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టుకు రూ.2,000, పీజీటీ, టీజీటీ పోస్టుకు రూ.1,500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. 2021 మే 4 నుంచి 6 వరకు దరఖాస్తు ఫామ్‌లో తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. మొత్తం 4 స్టెప్స్‌లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. మొదటి స్టెప్‌లో పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలన్నీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. తర్వాతి స్టెప్‌లో విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాలన్నీ ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి. మూడో స్టెప్‌లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

పిల్లల్లో కొత్త వైరస్ స్ట్రెయిన్స్, సింగపూర్ లో స్కూళ్ళు, జూనియర్ కాలేజీల మూసివేత, ఇళ్ల నుంచే పాఠాల లెర్నింగ్

Cyclone Tauktae: బీభత్సం సృష్టిస్తున్న ‘తౌటే’ తుఫాను.. 273 మందితో కొట్టుకుపోయిన నౌక.. రంగంలోకి దిగిన సహాయక బృందాలు..!

Currency Found: టీటీడీ మాజీ ఉద్యోగి ఇంట గుట్టల కొద్దీ కరెన్సీ కట్టలు.. స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు