AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Currency Found: టీటీడీ మాజీ ఉద్యోగి ఇంట గుట్టల కొద్దీ కరెన్సీ కట్టలు.. స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు

తిరుపతిలో టీటీడీ మాజీ ఉద్యోగి ఇంట గుట్టల కొద్దీ కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఆ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్న తిరుమల తిరుపతి విజిలెన్స్ అధికారులు లెక్కింపు చేపట్టారు.

Currency Found: టీటీడీ మాజీ ఉద్యోగి ఇంట గుట్టల కొద్దీ కరెన్సీ కట్టలు.. స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు
Lakhs Of Currency Found In Ttd Ex Employee's House At Tirupati
Balaraju Goud
|

Updated on: May 17, 2021 | 8:58 PM

Share

Lakhs of Currency Found in Tirupati: తిరుపతిలో టీటీడీ మాజీ ఉద్యోగి ఇంట గుట్టల కొద్దీ కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఆ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్న తిరుమల తిరుపతి విజిలెన్స్ అధికారులు లెక్కింపు చేపట్టారు. శేషాచలనగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాస చారి అనే టీటీడీ మాజీ ఉద్యోగి ఇంట్లో గుట్టల కొద్దీ డబ్బు బయటపడింది. గతంలో టీటీడీ పోటులో పనిచేసి మానేసిన శ్రీనివాసాచారి ఏడాది క్రితం చనిపోయారు. బంధువులు ఎవరు లేకపోవడంతో ఒంటరిగా జీవించారు.

అయితే, శ్రీనివాసాచారి మరణానంతరం అతని ఇంటిని తిరుమల తిరుపతి దేవస్థానం స్వాధీనం చేసుకుంది. ఇందులో భాగంగా భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన విజిలెన్స్ అధికారులు ఇంటి తలుపులు తెరిచి షాక్‌కు గురయ్యారు. తలుపులు తీయగానే ఇంటినిండా డబ్బుల నోట్ల కట్టలు బయటపడ్డాయి. కాగా, శ్రీనివాసాచారికి సంబంధించి బంధువులు ఎవరు లేకపోవడంతో డబ్బుని స్వాధీనం చేసుకున్న టీటీడీ అధికారులు లెక్కిస్తున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం డబ్బు పది లక్షలకు పైగా ఉండొచ్చని భావిస్తున్నారు టీటీడీ సిబ్బంది.

Read Also..  భార‌త్ సీర‌మ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 25 లక్షల విలువైన వ్యాక్సిన్లు దగ్ధం