Indian Railway: కరోనా మహమ్మారి తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇక ఇండియన్ రైల్వేలో ఇప్పటికే ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడగా, తాజాగా మరో నోటిఫికేసన్ కూడా వెలువడింది. భారతీయ రైల్వే ఆధ్వర్యంలో పని చేస్తున్న రైల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీలో అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 23వ తేదీ వరకు గడువు ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 45 పోస్టులను భర్తీ చేస్తోంది రైల్వే శాఖ. ఈ ఉద్యోగాలకు బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే గేట్‌లో అర్హత సాధించాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 45
అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ చేసి గేట్‌లో అర్హత సాధించాలి. అభ్యర్థులు 21 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 23
వెబ్‌సైట్: rlda.indianrailways.gov.in.
ఇవి కూడా చదవండి: