భారత ప్రభుత్వ రంగానికి చెందిన తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్.. 901ట్రేడ్ అప్రెంటిస్, నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, టర్నర్, మెకానిక్ (మోటర్ వెహికల్), ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, వెల్డర్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, జియాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/ఎన్‌సీవీటీ/డీజీఈటీ/సీఏఎస్ఏఏ/ఎన్‌టీసీ/పీఎన్‌టీసీ/బీకాం/బీఎస్సీ/బీబీఏ/బీసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు అక్టోబర్ 1, 2022వ తేదీ నాటికి 14 నుంచి 30 యేళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 11, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. అనంతరం నింపిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా నవంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.10,019 నుంచి రూ.12,524ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: NLC India Limited, Neyveli, Tamil Nadu.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.