NIT AP Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లి గూడెంలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 14 ఖాళీల భర్తీ కోసం నోటిఫకేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* మొత్తం 14 ఖాళీల్లో భాగంగా.. లైబ్రేరియన్ (01), ఎస్ఏఎస్ ఆఫీసర్ (01), ఎస్ఏఎస్ అసిస్టెంట్ (01), జూనియర్ ఇంజినీర్ (02), టెక్నీషియన్ (04), సీనియర్ టెక్నీషియన్ (01), జూనియర్ అసిస్టెంట్ (04) పోస్టులను తీసుకోనున్నారు.
* పైన తెలిపిన పోస్టులను అనుసరించి.. ఇంటర్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* అభ్యర్థులను రాతపరీక్ష/ టెస్ట్ (స్కిల్/ ఫిజికల్/ ప్రొఫిషియన్సీ)/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు.. ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదిగా 10-07-2021గా నిర్ణయించారు.
* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్ కాపీలను 19-07-2021లోగా పంపించాలి.
* హార్డ్ కాపీలను తాడేపల్లి గూడంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డైరెక్టర్ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..