NHPC Recruitment 2023: లక్షన్నర జీతంతో ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు జాబ్స్‌..నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌లో 401 ఉద్యోగాలు..

|

Dec 31, 2022 | 9:57 PM

భారత ప్రభుత్వరంగానికి చెందిన హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. 401 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల..

NHPC Recruitment 2023: లక్షన్నర జీతంతో ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు జాబ్స్‌..నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌లో 401 ఉద్యోగాలు..
NHPC Limited
Follow us on

భారత ప్రభుత్వరంగానికి చెందిన హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. 401 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, బీఈ, బీటెక్‌, డిగ్రీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జనవరి 25, 2023వ తేదీనాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 25, 2023వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ జనవరి 5, 2023 నుంచి ప్రారంభమవుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.1,60,000ల వరకు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • ట్రైనీ ఇంజినీర్ (సివిల్) పోస్టులు: 136
  • ట్రైనీ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు: 41
  • ట్రైనీ ఇంజినీర్ (మెకానికల్) పోస్టులు: 108
  • ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్) పోస్టులు: 99
  • ట్రైనీ ఆఫీసర్ (హెచ్‌ఆర్‌) పోస్టులు: 14
  • ట్రైనీ ఆఫీసర్ (లా) పోస్టులు: 3

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.