NHM East Godavari Jobs 2022: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM East Godavari District).. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ డాక్టర్ (Specialist Doctor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన..
DMHO East Godavari Specialist Doctor Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM East Godavari District).. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ డాక్టర్ (Specialist Doctor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 98
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
- అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ పోస్టులు: 12
- జీరియాట్రిక్ పోస్టులు: 13
- ఈఎన్‌టీ పోస్టులు: 12
- పీడియాట్రిక్స్ పోస్టులు: 13
- స్కిన్ పోస్టులు: 13
- ఆర్థోపెడిక్స్ పోస్టులు: 7
- చెస్ట్ పోస్టులు: 11
- ఎన్‌సీడీ పోస్టులు: 13
- జనరల్ సర్జరీ పోస్టులు: 4
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్ లేదా మెడికల్ పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలంగాణ మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.
అడ్రస్: Dist. Medical & Health Officer, Kakinada District, East Godavari District, AP.
ఇంటర్వ్యూ తేదీ: జులై 11, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.