NSUT Recruitment 2021: నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఎస్‌యూటీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 25 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* మొత్తం 25 ఖాళీలకు గాను అసిస్టెంట్ ప్రొఫెసర్ (17), అసోసియేట్ ప్రొఫెసర్ (06), ప్రొఫెసర్ (02) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులను సివిల్ విభాగంలో తీసుకోనున్నారు.
* పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్ అండ్ ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్/పరిశోధన/పరిశ్రమ రంగంలో అనుభవం ఉండాలి.
* ప్రొఫెసర్ పోస్టులకు 55 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెస్ పోస్టులకు 50 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 35 ఏళ్లు వయసు మించకూడదు.
* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం హార్డ్‌కాపీలను ది రిజిస్ట్రార్, నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ఆజాద్ హింద్ ఫౌజ్ మార్గ్, సెక్టర్–3, ద్వారకా, న్యూఢిల్లీ–110078 చిరునామాకు పంపించాలి.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా 16.07.2021ని, దరఖాస్తు హార్డ్ కాపీలను పంపించేందుకు చివరి తేదీగా 02-08-2021గా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Telangana School Reopening: జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. తెలంగాణ సర్కార్ నిర్ణయం