నీట్ యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ 2022 వచ్చేసింది. ఈ నెల 28నుంచి కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించడానికి అధికారులు గ్నీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు తమ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్లను సమర్పించవచ్చని వారు తెలిపారు. అల్ ఇండియా కోటాకు సంబంధించిన నీట్ యూజీ సీట్ల కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) విడుదల చేసింది. ఇదే క్రమంలో రేపు(నవంబర్ 28) నుంచి రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. మాప్ అప్ రౌండ్ కోసం అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్లను తమ అధికారిక వెబ్‌సైట్ Mcc.nic.in లో సమర్పించవచ్చని ఎంసీసీ అధికారులు తెలిపారు.
ఎంసీసీ అధికారులు విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం.. 15% ఆల్ ఇండియా కోటాలో భాగంగా సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ సీట్ల కోసం నీట్ యూజీ కౌన్సెలింగ్ నవంబర్ 28న ప్రారంభమవుతుంది.
కాగా, ఎంసీసీ మాప్ అప్ రౌండ్ తర్వాత మిగిలిన మిగిలిన ఖాళీల కోసం మరో కౌన్సిలింగ్ రౌండ్‌ను నిర్వహిస్తుంది.