AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET-UG 2024 Revised Result: నీట్‌ యూజీ తుది ఫలితాల్లో 17కు తగ్గిన టాపర్ల సంఖ్య.. కేటగిరీ వైజ్ కటాఫ్‌ మార్కులు ఇవే

నీట్‌ యూజీ 2024 సవరించిన (రివైజ్‌డ్ రిజల్ట్స్‌) ఫలితాలను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆల్‌ ఇండియా ర్యాంకర్ల లిస్టును ఎన్టీయే శుక్రవారం (జులై 26) విడుదల చేసింది. తాజాగా ఫలితాల్లో నీట్‌ ర్యాంకర్ల సంఖ్య 67 నుంచి 17కి తగ్గింది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత వెలువడిన సవరించిన ఫలితాల్లో టాప్‌ స్కోర్ సాధించిన 17 మందికి 720 మార్కులకు 720 సాధించినట్లు ఎన్టీయే వెల్లడించింది. ఈ మేరకు నీట్‌ - యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను (రీరివైజ్డ్‌) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల..

NEET-UG 2024 Revised Result: నీట్‌ యూజీ తుది ఫలితాల్లో 17కు తగ్గిన టాపర్ల సంఖ్య.. కేటగిరీ వైజ్ కటాఫ్‌ మార్కులు ఇవే
NEET-UG 2024 revised Result
Srilakshmi C
|

Updated on: Jul 27, 2024 | 2:26 PM

Share

న్యూఢిల్లీ, జులై 27: నీట్‌ యూజీ 2024 సవరించిన (రివైజ్‌డ్ రిజల్ట్స్‌) ఫలితాలను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆల్‌ ఇండియా ర్యాంకర్ల లిస్టును ఎన్టీయే శుక్రవారం (జులై 26) విడుదల చేసింది. తాజాగా ఫలితాల్లో నీట్‌ ర్యాంకర్ల సంఖ్య 67 నుంచి 17కి తగ్గింది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత వెలువడిన సవరించిన ఫలితాల్లో టాప్‌ స్కోర్ సాధించిన 17 మందికి 720 మార్కులకు 720 సాధించినట్లు ఎన్టీయే వెల్లడించింది. ఈ మేరకు నీట్‌ – యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను (రీరివైజ్డ్‌) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. టాప్‌ ర్యాంకర్ల సంఖ్య తగ్గడంతోపాటు మరోవైపు వేల మంది విద్యార్థుల మార్కులు, ర్యాంకుల్లో గణనీయమైన మార్పు కనిపించింది. అర్హత సాధించిన వారి సంఖ్య, కటాఫ్‌ మార్కులు స్వల్పంగా తగ్గాయి.

ఫిజిక్స్‌ సబ్జెక్టులో ఓ ప్రశ్నకు సంబంధించిన జవాబుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో సరైన సమాధానానికి మాత్రమే మార్కులు కేటాయించాలని, మిగిలిన సమాధానాలకు మార్కులు తొలగించాలని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీ సూచించింది. అది సూచించిన జవాబును పరిగణనలోకి తీసుకొని మళ్లీ మూల్యాంకనం చేసి తాజాగా ఫలితాలను విడుదల చేశారు. ఇందులో దాదాపు 4.2 లక్షల మందికి 5 మార్కుల చొప్పున తొలగించారు. వారిలో 720కి 720 మార్కులు సాధించిన 61 మంది విద్యార్థుల్లోని 44 మంది ఉన్నారు. దీంతొ వీరికి 720కి 715 మార్కులు సర్దుబాటు చేశారు. మార్కుల తొలగించడంతో వీరి ర్యాంకులపై ప్రభావం చూపింది. మరోవైపు గ్రేస్‌ మార్కులు ఇచ్చిన 1563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించి, వారందరికీ మళ్లీ మార్కులు కేటాయించారు.

గత ఏడాది జనరల్ కటాఫ్‌ 720కి 137గా నిర్ణయించగా.. ఈ ఏడాది జనరల్‌, జనరల్‌-పీహెచ్‌ కేటగిరీకి 720-164కు పెరగడం విశేషం. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 161-127 మధ్య ఉంది. కటాఫ్‌ మార్కులను NEET UG 2024 ప్రవేశ పరీక్షలొ ఆల్-ఇండియా మెరిట్ లిస్ట్‌లో సాధించిన అత్యధిక మార్కుల ఆధారంగా నిర్ణయించారు. దాని ప్రకారం పర్సంటైల్ స్కోర్‌లు కూడా అప్‌డేట్ చేశారు. కాగా ఈ ఏడాది దాదాపు 24,06,079 మంది అభ్యర్ధులు నీట్‌ యూజీ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 23,33,297 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 72,782 మంది అభ్యర్థులు హాజరుకాలేదు. టాప్‌ ర్యాంక్‌ సాధించిన వారిలో అత్యధిక మంది రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వారు కావడం విశేషం. రాజస్థాన్‌ నాలుగు ర్యాంక్‌లను కైవసం చేసుకోగా.. మహారాష్ట్రలో ముగ్గురు టాపర్లు నిలిచారు. ఇక బీహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, చండీగఢ్, తమిళనాడు, కేరళ.. రాష్ట్రాల్లో ఒక్కో టాపర్‌ ఉన్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో ఇద్దరేసి చొప్పున టాప్‌ ర్యాంకర్లు ఉన్నారు. ఈ ఏడాది 24 లక్షల మందికిగానూ 13,15,853 మంది క్వాలిఫై అయ్యారు. తొలుత వెల్లడించిన ఫలితాలతో పోల్చితే 415 మంది అర్హత సాధించలేకపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us