
న్యూఢిల్లీ, మే 30: దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5వ తేదీన 571 పరీక్ష కేంద్రాల్లో నీట్ 2024 ఎగ్జాం జరిగిన సంగతి తెలిసిందే. ఫలితాల వెల్లడికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సమాయత్తమవుతోంది. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదలైంది. దీనిపై అభ్యంతరాలు లేవనెత్తడానికి మే 31వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు అవకాశం ఇచ్చారు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్ధుల ఓఎమ్‌ఆర్ షీట్, క్వశ్చన్ పేపర్, రెస్పాన్స్ షీట్లను కూడా ఎన్టీయే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యంతరాలను కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నారు. ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లించి కీపై అభ్యంతరాలు తెలియజేయాలని ఎన్టీయే వివరించింది.
అభ్యంతరాల స్వీకరణ అనంతరం జూన్ 14న ఫలితాలతో పాటు తుది ఆన్సర్ కీ కూడా విడుదల చేయనున్నారు. నీట్ యూజీ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
నీట్ యూజీ 2024 ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నీట్ యూజీ 2024 ఆన్సర్ ఛాలెంజ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.