NBCC Recruitment 2022: బీటెక్ గ్రాడ్యుయేట్లకు అదిరిపోయే ఆఫర్! ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకు పైగా జీతంతో
మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ (Ministry of Housing and Urban Affairs)కు చెందిన చెందిన నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
Latest Executive jobs: మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ (Ministry of Housing and Urban Affairs)కు చెందిన నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు: ఖాళీల సంఖ్య: 9
పోస్టులు: 1. అసిస్టెంట్ మేనేజర్ (సాఫ్టవేర్ డెవలపర్): 4
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
2. సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్టూటివ్ (ఐటీ): 2
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
3. అసిస్టెంట్ మేనేజర్లు (లా): 3
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో లా కోర్సులో రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లు మించరాదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 4, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: