National Medical Commission: ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్శిటీల్లో 50 శాతం సీట్లకు సంబంధించి ఫీజులు, ఇతర ఛార్జీల కోసం జాతీయ వైద్య కమిషన్ ఆదివారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్ల ఫీజులు సంబంధిత రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో సమానంగా ఉంటాయని తెలిపారు. అంటే ఇప్పుడు విద్యార్థులు తక్కువ ఖర్చుతో మెడిసిన్ చదవగలుగుతారు.’విస్తృతమైన చర్చల తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్శిటీలు 50 శాతం ఫీజులు తగ్గించినట్లు వార్తా సంస్థ ANI తెలిపింది. డీమ్డ్ యూనివర్శిటీల సీట్లు నిర్దిష్ట రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల ఫీజుతో సమానంగా ఉండాలి. మెడికల్ ఫీజు తగ్గించాలని చాలా కాలంగా డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.
ఏ విద్యార్థులు ప్రయోజనం పొందుతారు?
తగ్గించిన ఫీజుల వల్ల ఎక్కువగా ప్రభుత్వ కోటా సీట్లు పొందిన విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. కానీ ప్రైవేట్ కాలేజీలు, డ్రీమ్డ్ యూనివర్సిటీలలో ఈ సీట్లు 50 శాతానికి పరిమితం చేశారు. మెడికల్ కాలేజీలో చదవడం చాలా ఖరీదైనది. దీని కారణంగా పేద వర్గాల విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు కట్టలేని విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది. నేషనల్ మెడికల్ కమిషన్ వివరణాత్మక పద్ధతిలో మార్గదర్శకాలను విడుదల చేసింది. మీకు కావాలంటే మీరు కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
Fees of 50% seats in private medical colleges will now be at par with Govt Medical colleges of a state/UT: National Medical Commission pic.twitter.com/d06vGiXR6b
— ANI (@ANI) February 5, 2022