MSME Recruitment 2022: నెలకు రూ.2 లక్షలకుపైగా జీతంతో కేంద్ర మంత్రిత్వశాఖ సంస్థలో ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలు ఇవే..

|

Sep 18, 2022 | 7:38 AM

భారత ప్రభుత్వ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన హర్యాణా రాష్ట్రంలోని రోహ్‌తక్‌లోనున్న మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (MSME Haryana) టెక్నాలజీ సెంటర్‌.. ఒప్పంద ప్రాతిపదికన 17 మేనేజర్‌, పర్చేజ్‌ ఆఫీసర్‌, స్టోర్స్ ఆఫీసర్ తదితర (Manager Posts) పోస్టుల భర్తీకి..

MSME Recruitment 2022: నెలకు రూ.2 లక్షలకుపైగా జీతంతో కేంద్ర మంత్రిత్వశాఖ సంస్థలో ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలు ఇవే..
MSME
Follow us on

MSME Haryana Manager Recruitment 2022: భారత ప్రభుత్వ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన హర్యాణా రాష్ట్రంలోని రోహ్‌తక్‌లోనున్న మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (MSME Haryana) టెక్నాలజీ సెంటర్‌.. ఒప్పంద ప్రాతిపదికన 17 మేనేజర్‌, పర్చేజ్‌ ఆఫీసర్‌, స్టోర్స్ ఆఫీసర్ తదితర (Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి మెకానికల్/ప్రొడక్షన్‌/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకాట్రానిక్స్/ఆటోమొబైల్‌/మెటలర్జీ/మెకానికల్ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, టూల్‌ డిజైన్‌/మార్కెటింగ్‌/మేనేజ్‌మెంట్‌/ఆటోమొబైల్స్‌ తదితర విభాగంలో డిప్లొమా, పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు సెప్టెంబర్‌ 27, 2022వ తేదీ నాటికి 32 నుంచి 40 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు సెప్టెంబర్‌ 26, 2022వ తేదీలోపు దరఖాస్తులను పంపించాలి. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధాకంగా ఎంపిక నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.35,400ల నుంచి రూ.2,08,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు..

  • మేనేజర్ (మెయింటెనెన్స్‌) పోస్టులు: 1
  • మేనేజర్ (హెచ్‌/టి) పోస్టులు: 1
  • మేనేజర్ (డిజైన్) పోస్టులు: 1
  • మేనేజర్ (మార్కెటింగ్) పోస్టులు: 1
  • అసిస్టెంట్‌ మేనేజర్ (అడ్మిన్ & అకౌంట్స్) పోస్టులు: 1
  • పర్చేజ్‌ ఆఫీసర్‌ పోస్టులు: 1
  • స్టోర్స్ ఆఫీసర్ పోస్టులు: 1
  • ఇంజినీర్ (ప్రొడక్షన్) పోస్టులు: 1
  • ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ మెకానికల్) పోస్టులు: 5
  • సీనియర్ టెక్నీషియన్ (ప్రొడక్షన్) పోస్టులు: 2
  • సీనియర్ టెక్నీషియన్ మెయింటెనెన్స్ (ఈ/ఎం) పోస్టులు: 1

అడ్రస్‌: THE DEPUTY GENERAL MANAGER, MSME TECHNOLOGY CENTRE, ROHTAK, Plot No.10&11, Sector 30 B, IMT, Rohtak 124021, Haryana.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.