MCTE Recruitment 2021: మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఎంసీటీఈ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మధ్యప్రదేశ్‌లోని మోహ్వాల్ ఉన్న ఈ సంస్థలో మొత్తం 37 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా ఏయే పోస్టులను భర్తీ చేయనున్నారు, విద్యార్హతలు ఏంటి అన్న దానిపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, డాఫ్ట్స్‌మెన్, సివిలియన్ మోటార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ప్రొఫెషనల్ సర్టిఫికెట్లు, టైపింగ్ స్పీడ్‌తోపాటు అనుభవం ఉండాలి.
* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును ప్రిసైడింగ్ ఆఫీసర్, స్క్రుటినీ సెల్, సీఐపీహెచ్‌ఈఆర్ వింగ్, మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలీకమ్యూనికే షన్ ఇంజనీరింగ్, మోహ్వా, మధ్యప్రదేశ్ అడ్రస్‌కు పంపించాలి.
* దరఖాస్తులకు చివరి తేదీగా 27.07.2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు https://indianarmy.nic.in/home వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Also Read: Prasar Bharati e-office: ఉద్యోగుల పని మొత్తం ఆన్‌లైన్‌లోనే.. ఈ-ఆఫీస్‌కు మారిపోయిన ప్రసార భారతి
Tokyo Olympics: స్వర్ణం సాధిస్తే.. రూ.6 కోట్లు ..! హరియాణా అథ్లెట్లకు బంపర్ ఆఫర్