Volunteer Jobs 2025: నిరుద్యోగులకు అలర్ట్.. పదో తరగతి అర్హతతో వాలంటీర్ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
MYBharat Youth Volunteer Recruitment 2025: సమాజ సేవ చేసేందుకు వాలంటీర్ల నియామకాలకు కేంద్ర ప్రభుత్వం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓ వైపు సేవ చేస్తూనే ప్రతి నెల స్టైపెండ్ రూపంలో పారితోషికాన్ని కూడా పొందవచ్చు. సమాజం కోసం ఏదైనా చేయాలని..

మేరా యువ భారత్ వాలంటీర్ నోటిఫికేషన్ ద్వారా సమాజ సేవ చేసేందుకు వాలంటీర్ల నియామకాలకు కేంద్ర ప్రభుత్వం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓ వైపు సేవ చేస్తూనే ప్రతి నెల స్టైపెండ్ రూపంలో పారితోషికాన్ని కూడా పొందవచ్చు. సమాజం కోసం ఏదైనా చేయాలని, సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్న ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఈ వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చిత్తూరులోని మేరా యువ భారత్ కార్యాలయంలో అభ్యర్ధులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది. పదో తరగతి అర్హతతోపాటు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. అలాగే దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ప్రకటన కింద మొత్తం 20 మందిని ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 15, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు వాలంటీరుగా ఏడాది కాలం పనిచేయాల్సి ఉంటుంది. వీరికి ప్రతి నెలకు రూ.5 వేల వరకు స్టైఫండ్ చెల్లిస్తారు.
వాలంటీర్ నియామకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
విధులు ఏముంటాయంటే..
పదో తరగతి పాసై, సమాజ సేవ చేయాలని ఆసక్తి ఉన్న యువత ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు తమ పరిధిలో సామాజిక చైతన్య కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. అంటే.. ఈ వాలంటీర్లకు ప్రత్యేకంగా బ్లాకులను కేటాయిస్తారు. రెండు మండలాలను కలిపి ఓ బ్లాక్‌గా గుర్తిస్తారు. వాలంటీర్లు యువజన, మహిళా సంఘాలను సమన్వయం చేసుకుని.. ఆరోగ్యం, అక్షరాస్యత, పచ్చదనం-పరిశుభ్రత, మహిళా సాధికారత కోసం పనిచేయాల్సి ఉంటుందని చిత్తూరు (క్రీడలు) జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్ వెల్లడించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




