MECON Recruitment: ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన మెకాన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.

|

Aug 31, 2021 | 9:50 AM

MECON Recruitment 2021: భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన మెకాన్‌ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాంచీలో ఉన్న ఈ సంస్థలో...

MECON Recruitment: ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన మెకాన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
Follow us on

MECON Recruitment 2021: భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన మెకాన్‌ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాంచీలో ఉన్న ఈ సంస్థలో మొత్తం 59 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 59 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జూనియర్‌ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్‌ ఇంజనీర్, అసిస్టెంట్‌ ఇంజనీర్, డిప్యూటీ ఇంజనీర్‌ వంటి పోస్టులు ఉన్నాయి.
* అభ్యర్థులను మార్కెట్‌ రీసెర్చ్, అడ్మినిస్ట్రేషన్, ఐటీ విభాగం, మార్కెటింగ్, సివిల్, హెచ్‌ఆర్‌ విభాగాల్లో తీసుకోనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ/పీజీడీఎం, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత విభాతంలో అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 30ఏళ్ల నుంచి 47ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ.35,200 నుంచి రూ.86,400 వరకు జీతంగా చెల్లిస్తారు.
* అభ్యర్థులను ముందుగా పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 25-09-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: North Korea: మళ్ళీ అణ్వాయుధాలు సిద్ధం చేస్తున్న ఉత్తర కొరియా..ఆందోళనలో ప్రపంచ దేశాలు

Telangana Rains: ఎటు వైపు నుంచి ఏ ప్రవాహం వస్తుందో.. ఎక్కడ ఏ వాగు ఉప్పొంగుతుందో తెలీని స్థితి. భయం గుప్పిట్లో తెలంగాణం

తెలియకుండానే ప్రాణాలను హరిస్తున్న మహమ్మారి.. బీపీ లెక్కలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు ఇవే.. ఇంత ఉంటే సాధారణమే అంటా..