Mazagon Dock Jobs: పదో తరగతి అర్హతతో భారీ రిక్రూట్‌మెంట్.. 1501 పోస్టులు.. చివరితేదీ ఎప్పుడంటే!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (Mazagon Dock Shipbuilders Limited) ముంబాయిలో పలు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Non Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...
MDL Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (Mazagon Dock Shipbuilders Limited) ముంబాయిలో పలు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Non Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు పోస్టు: నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు: 1501
పోస్టుల వివరాలు: ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్, కంప్రెసర్ అటెండెంట్, బ్రాస్ ఫినిషర్, కంపోజిట్ వెల్డర్, ఎలక్ట్రికల్ క్రేన్ ఆపరేటర్స్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, జూనియర్ క్యూసీ ఇన్‌స్పెక్టర్, జూనియర్ డ్రాఫ్ట్స్‌మెన్, ప్లానర్ ఎస్టిమేటర్, గ్యాస్ కట్టర్, స్టోర్స్ కీపర్, ఫైర్ ఫైటర్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్.. ఇతర పోస్టులు.
వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పదో తరగతితోపాటు, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: మొత్తం 30 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. జీకే నుంచి 10 ప్రశ్నలు, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలు, టెక్నికల్ నాలెడ్జ్ నుంచి 10 ప్రశ్నల చొప్పున 30 ప్రశ్నలకు 30 మార్కులకు ఉంటాయి.
రాత పరీక్ష తేదీ: మార్చి 15, 2022.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 8, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: