కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్.. ఒప్పంద ప్రాతిపదికన టీమ్ లీడర్, ఎక్స్‌పర్ట్, అవుట్ రీచ్ స్పెషలిస్ట్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ (ఐటీ), ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్), టెలి అడ్వైజర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తుచేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, డాక్టరేట్, సీఏ/ఐసీఎంఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టైపింగ్ స్కిల్ ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 30 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు అక్టోబర్ 26, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.25,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: The Director, Center for Sustainable Agriculture & Climate Change and Adaptation (CSA & CCA), National Institute of Agricultural Extension Management (MANAGE), Rajendranagar, Hyderabad – 500 030.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.