లైఫ్ ఇన్స్యూరెన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) నుంచి భారీ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,394 అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్(ఏడీఏ) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఒక్క సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ హైదరాబాద్ కేంద్రంగా వివిధ డివిజనల్ ఆఫీసుల్లో పనిచేసేందుకు 1,408 అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్(ఏడీఏ) పోస్టులను ప్రకటించింది.
ఈ అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉన్న భారతీయ పౌరులు అర్హులు. దీనిలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,500 వేతనం అందిస్తారు. ఒక సంవత్సరం ప్రోబేషన్ పిరియడ్ ఉంటుంది. అర్హతున్న అభ్యర్థులు ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ లో 21/01/023 నుంచి 10/02/2023 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లో కడప , మచిలీపట్నం, నెల్లూరు , రాజమండ్రి , విశాఖపట్నం జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి.
తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ డివిజన్ల పరిధిలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష.. దీనిని 100 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌తో సహా మూడు విభాగాలు ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలకు కలిపి మార్కులు 70 (35+35), ఇంగ్లిష్ నుంచి 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారు మెయిన్స్ పరీక్షకు అర్హులు అవుతారు.
మెయిన్స్ పరీక్ష.. దీనిని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. మొత్తం 150 మార్కులను కలిగి ఉంటుంది. దీనిలో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.
మెడికల్ ఎగ్జామినేషన్.. ఇంటర్వ్యూ తర్వాత అర్హత పొందిన దరఖాస్తుదారులు తప్పనిసరిగా మెడికల్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాల్సి ఉంటుంది. వారు ఈ దశలో విజయం సాధిస్తే.. అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ (ADO) ఉద్యోగం పొందుతారు.
పూర్తి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
అప్లై చేయడానికి క్లిక్ చేయండి..
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.