LIC Scholarship: పదో తరగతి పాసైన విద్యార్థులకు ఎల్‌ఐసీ సదవకాశం.. రూ. 10 వేల చొప్పున స్కాలర్షిప్‌..

LIC Scholarship: దేశీయ అతిపెద్ద బీమా రంగ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కోసం స్కాలర్షిప్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా పదో తరగతి ఉత్తీర్ణులై...

LIC Scholarship: పదో తరగతి పాసైన విద్యార్థులకు ఎల్‌ఐసీ సదవకాశం.. రూ. 10 వేల చొప్పున స్కాలర్షిప్‌..
Lic Scholarship
Follow us

|

Updated on: Sep 24, 2022 | 10:53 AM

LIC Scholarship: దేశీయ అతిపెద్ద బీమా రంగ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కోసం స్కాలర్షిప్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా పదో తరగతి ఉత్తీర్ణులై ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా అర్హులైన విద్యార్థులు స్కాలర్షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 11వ తరగతిలో చేరి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఈ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన కాలేజీలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను 11వ తరగతి ప్రవేశం పొంది ఉండాలి. అలాగే పదో తరగతిలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థుల వార్షిక కుటుంబ ఆదాయం రూ. 3,60,000లోపు ఉండాలి. కరోనా కారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ. 10,000 చొప్పున రెండేళ్లు స్కాలర్షిప్‌ను అందిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, విద్యార్హత మార్క్స్ షీట్, ఆదాయ దృవీకరణ పత్రం, ప్రస్తుతం ప్రవేశం పొందిన కాలేజ్ ఐడి లేదా బోనఫైడ్ సర్టిఫికెట్, ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజు రిసిప్ట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్యాస్ట్ సర్టిఫికెట్ తదితర డ్యాక్యుమెంట్లు ఉండాలి. స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి 30-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇంటర్‌ పూర్తి చేసిన వారికి కూడా..

ఇదిలా ఉంటే ఇంటర్‌ పూర్తి చేసిన వారికి కూడా ఎల్‌ఐసీ స్కాలర్షిప్‌ పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన కళాశాల/యూనివర్సిటీలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను గ్రాడ్యుయేషన్ మొదటి ఏడాది ప్రవేశం పొంది ఉండాలి. అలాగే విద్యార్థులు 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థుల పేరెంట్స్‌ వార్షిక ఆదాయం రూ. 3,60,000 లోపు ఉండాలి. ఈ స్కాలర్షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ. 15,000 చొప్పున మూడేళ్లు ఆర్థిక సహాయం అందిస్తారు. దీనిని కూడా దరఖాస్తుల స్వీకరణ 30-09-2022తో ముగియనుంది.

మరిన్ని విద్య, ఉద్యో వార్తల కోసం క్లిక్ చేయండి..

రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..
బిగ్‏బాస్ ఫేమ్ శ్వేత వర్మకు అసభ్యకరమైన మెసేజులు..
బిగ్‏బాస్ ఫేమ్ శ్వేత వర్మకు అసభ్యకరమైన మెసేజులు..