Infosys Recruitment: కరోనా సమయంలో మందగించిన ఉద్యోగాల నియాకం ఇప్పుడు మళ్లీ ఊపకుంది. పరిస్థితులు చక్కబడడం, డిమాండ్ పెరగడంతో మళ్లీ కంపెనీలు ఉద్యోగులను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ టెక్నాలజీకి డిమాండ్ పెరగడంతో ఐటీ కంపెనీలు నియమాకాలను పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌కు చెందిన దిగ్గజ ఐటీ సంస్థ.. ఇన్ఫోసిస్ భారీగా ఫ్రెషర్స్‌ను తీసుకోనున్నట్లు తెలిపింది.
సెప్టెంబర్ 30, 2021తో ముగిసిన త్రైమాసికంలో ఫలితాలను ప్రకటించిన తర్వాత ఇన్ఫోసిస్ పెద్ద ఎత్తున ఫ్రెషర్స్‌ను తీసుకోవడానికి సిద్ధమైంది. గతేడాది ఇన్ఫోసిస్ 35,000 ఉద్యోగులను తీసుకుంటే ఈ ఏడాది ఏకంగా 45,000 మంది ఫ్రెషర్లను క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా తీసుకోనున్నారు. ఈ విషయమై ఇన్ఫోసిన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు మాట్లాడుతూ.. మార్కెట్‌పై పట్టు సాధించడం కోసమే తాము 45,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకున్నట్లు తెలిపారు.
డిజిటల్ టెక్నాలజీకి డిమాండ్ పెరగడం, పరిశ్రమలో అట్రిషన్ రేటు పెరగడం వల్ల సవాళ్లు ఎదురు అవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇక ఇన్ఫోసిస్ ఉద్యోగుల అట్రిషన్ రేటు కూడా పెరిగింది. గతేడాది అట్రిషన్ రేటు 12.8 శాతం ఉంటే ఈ ఏడాది 20.1%గా ఉంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ త్రైమాసికం చివరినాటికి ఇన్ఫోసిస్‌లో 2,79,617 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.
Also Read: Corona In Russia: రష్యాలో మరణ మృదంగం.. ఒక్క రోజులో 984 మంది మృతి..
Edible Oil Prices: పండుగలవేళ కేంద్రం శుభవార్త.. దేశీయంగా తగ్గిన వంట నూనె ధరలు!