JCL Recruitment: జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం..

JCL Recruitment 2021: జూట్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోల్‌కతాలో ఉన్న ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఏయో విభాగాల్లో..

JCL Recruitment: జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం..
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 28, 2021 | 11:51 AM

JCL Recruitment 2021: జూట్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోల్‌కతాలో ఉన్న ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 63 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అకౌంటెంట్‌ (12), జూనియర్ అసిస్టెంట్‌ (11), జూనియర్‌ ఇన్‌స్పెక్టర్ (40) పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌, ఎంకాంలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-12-2021 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* అకౌంటెంట్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 28,600 నుంచి రూ. 1,15,500 వరకు చెల్లిస్తారు. అలాగే జూనియర్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 28,600 నుంచి రూ. 86,500 వరకు అందిస్తారు.

* అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ 24-12-2021న ప్రారంభమవుతుండగా 13-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Year Ender 2021: పీకల దాకా మద్యం తాగి ప్రాణాలు తీస్తున్న వాహనదారులు.. ఈ ఏడాది ఎంతమందో తెలుసా?

ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకెళ్లిన దొంగలు !! పోలీసులు షాక్‌ !! వీడియో

Viral Video: నిప్పులు చిమ్మే ఫైర్‌ ఫ్రూట్‌ దోసె.. ఎక్కడ దొరుకుతుందంటే..