Private Jobs: డిగ్రీ లేకుండానే నెలకు రూ.లక్షలు సంపాదించొచ్చు.. ఆ ఉద్యోగాలేంటో ఓ లుక్కేయండి..

|

Jul 26, 2022 | 4:05 PM

డిగ్రీ లేకుండానే.. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించగలిగే చాలా ఉద్యోగాలు చాలా ఉన్నాయన్న విషయం మీకు తెలుసా..? వీటి కోసం ఏ డిగ్రీ కూడా అవసరం లేదు.. అవేంటో తెలుసుకోండి

Private Jobs: డిగ్రీ లేకుండానే నెలకు రూ.లక్షలు సంపాదించొచ్చు.. ఆ ఉద్యోగాలేంటో ఓ లుక్కేయండి..
Money
Follow us on

Jobs without Degree: మంచి ఉద్యోగం చేసి పెద్ద మొత్తంలో సంపాదించాలనేది అందరి కోరిక. ఇందుకోసం ఏళ్ల తరబడి చదువుకుంటారు. తల్లిదండ్రులు.. తమ పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో ఉండాలన్న కొరికతో పెద్ద పెద్ద స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్ తీసుకొని చదివిస్తారు. అయితే ఇలాంటి సందర్భంలో.. అడ్మిషన్ తీసుకున్నా చదువు పూర్తి చేయలేక కొంతమంది.. చదువు పూర్తయ్యాక మరికొంత మంది ఉద్యోగాల కోసం అక్కడక్కడా సంచరించాల్సి వస్తోంది. కానీ డిగ్రీ లేకుండానే.. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించగలిగే చాలా ఉద్యోగాలు చాలా ఉన్నాయన్న విషయం మీకు తెలుసా..? వీటి కోసం ఏ డిగ్రీ కూడా అవసరం లేదు.. కొన్ని మెలకువలు ఉంటే సరిపోతుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

కమర్షియల్ పైలట్‌కు డిగ్రీ అవసరం లేదు..

కమర్షియల్ పైలట్ కావడానికి డిగ్రీ అవసరం లేదు.. పైలట్ కావాలనుకుంటే డిప్లొమా తీసుకొని కమర్షియల్ పైలట్ కావచ్చు. అయితే ఇందుకోసం 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి పైలట్ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. కమర్షియల్ పైలట్ అయిన తర్వాత ప్రతి నెలా రూ. 5 నుంచి 6 లక్షల వరకు సంపాదించవచ్చు.

ఇవి కూడా చదవండి

వెబ్ డెవలపర్ జీతం రూ.లక్ష..

ప్రస్తుతం అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ తమ తమ వెబ్‌సైట్‌ను సొంతంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో వెబ్ డెవలపర్లకు ఇంకా డిమాండ్ పెరుగుతోంది. వెబ్ డెవలపర్ కావడానికి ఏ డిగ్రీ కూడా అవసరం లేదు. అయితే, దీని కోసం వెబ్‌సైట్‌లు, ఇంటర్నెట్‌పై పరిజ్ఞానం ఉండాలి. ఏదైనా ఇన్‌స్టిట్యూట్ నుంచి వెబ్ డెవలపర్ కోర్సు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. మంచి అనుభవజ్ఞుడైన వెబ్ డెవలపర్ జీతం 80 వేల నుంచి 1 లక్ష రూపాయల వరకు ఉంటుంది.

కాసినో మేనేజర్‌కు రూ.లక్షల్లో జీతం..

భారతదేశంలో క్యాసినో మేనేజర్‌కు డిమాండ్ తక్కువగా ఉంది. కానీ విదేశాలలో దీనికి చాలా డిమాండ్ ఉంది. క్యాసినో నిర్వాహకుడి వార్షిక ఆదాయం 32 వేల నుంచి 58 వేల డాలర్లు ఉంటుంది. అంటే 25 లక్షల నుంచి 41 లక్షల రూపాయల వరకు ఉంటుంది. క్యాసినో మేనేజర్‌గా మారడానికి, డిగ్రీ అవసరం లేదు. అయితే దీని కోసం మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు.. క్యాసినోలో ఆడే ఆటల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

సోషల్ మీడియా ఎక్స్‌పర్ట్..

సోషల్ మీడియా ట్రెండ్ నిరంతరం పెరుగుతోంది. పెద్ద కంపెనీలు తమ సోషల్ మీడియాను నిర్వహించడానికి సోషల్ మీడియా నిపుణులను నియమించుకుంటున్నాయి. సోషల్ మీడియా నిపుణుడిగా మారడానికి డిగ్రీ అవసరం లేదు. కానీ ఇంటర్నెట్, మార్కెట్ గురించి మంచి పరిజ్ఞానం ఉండాలి. సోషల్ మీడియా నిపుణుడి జీతం ప్రతి నెలా 60 వేల రూపాయల వరకు ఉంటుంది.

రియల్ ఎస్టేట్ బ్రోకర్‌..

రియల్ ఎస్టేట్ బ్రోకర్ కావడానికి డిగ్రీ అవసరం లేదు. ఇందుకోసం రియల్‌ ఎస్టేట్‌పై అవగాహన, విషయాలను ప్రజలకు చక్కగా వివరించే సామర్థ్యం అవసరం. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆదాయాలు స్థిరంగా ఉండవు. ఒప్పందం ప్రకారం లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..