Warangal Kendriya Vidyalaya: నిరుద్యోగులకు శుభవార్త.. వరంగల్‌ కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు

Warangal Kendriya Vidyalaya: వరంగల్‌లోని కేంద్రీయ విద్యాలయం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది...

Warangal Kendriya Vidyalaya: నిరుద్యోగులకు శుభవార్త.. వరంగల్‌ కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు

Updated on: Mar 14, 2021 | 7:55 PM

Warangal Kendriya Vidyalaya: వరంగల్‌లోని కేంద్రీయ విద్యాలయం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీని కోసం సంస్థ నుంచి నోటిఫికేషన్‌ విడుదలైంది. పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, నర్స్‌, కంప్యూటర్‌ ఇన్స్ట్రక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్పోర్ట్స్ కోచ్, ఎడ్యుకేషనల్ కౌన్సెలర్ తదితర కేటగిరిల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఉద్యోగాలు:

పీజీటీ – ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ, ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్‌, ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.27,500 వరకు వేతనం చెల్లిస్తారు.

కంప్యూటర్‌ ఇన్స్ట్రక్టర్ – ఈ విభాగంలో బీఈ/బీటెక్, బీఎస్సీ, పీజీ డిప్లొమా, ఎమ్మెస్సీ ఉత్తీర్ణలై ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21250 చెల్లిస్తారు.

టీజీటీ – సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ ఉద్యోగాల్లో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. రూ.26,250 వేతనం చెల్లిస్తారు.

పీఆర్టీ(ప్రైమరీ టీచర్లు): పదో తరగతి, ఇంటర్మీడియేట్‌, డిప్లొమా,, బీఈడీ చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.21250 వరకు వేతనం చెల్లిస్తారు.

ఎడ్యుకేషన్‌ కౌన్సెలర్‌ -సైకాలజీలో బీఏ/బీఎస్సీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. రూ.26250 వరకు వేతనం చెల్లిస్తారు.

స్పోర్స్ట్ కోచ్: ఎంపీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.21250 వరకు వేతనం చెల్లిస్తారు

నర్సు: ఈ ఉద్యోగానికి నర్సింగ్‌లో డిప్లొమో చేసి ఉండాలి. ఎంపికైన వారికి రోజుకు రూ. 750 చొప్పున చెల్లిస్తారు.

ఈ పోస్టులకు దరఖాస్తులు ఆఫ్‌లైన్‌ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర మరిన్ని వివరాలకు https://warangal.kvs.ac.in/ వైబ్ సైట్ ను సందర్శించవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 18వ తేదీ.

ఇవీ చదవండి: IPPB New Charges : పోస్టల్ ఖాతాదారులకు షాక్ .. నగదు వేసినా .. తీసినా బాదుడే.. ఎప్పటి నుంచి అంటే.

Powerful Passports : మోస్ట్ పవర్ ఫుల్ పాస్‌పోర్ట్స్.. తొలి రెండు స్థానాల్లో జపాన్, సింగపూర్. ఇండియా వాల్యూ ఎంతంటే?