
హైదరాబాద్, సెప్టెంబర్ 11: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. సెప్టెంబర్ 16న మెహిదీపట్నంలో మెగా జాబ్ మేళా జరగనుంది. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మెహదీపట్నంలోని కింగ్స్ ప్యాలెస్‌లో PVNR ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 67 సమీపంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, ఫార్మా, హెల్త్‌కేర్, ఐటీ, ఐటీఈఎస్, విద్య, బ్యాంకింగ్ వంటి వివిధ రంగాలలో అవకాశాలను అందిస్తాయని నిర్వాహకుడు, ఇంజనీర్ అయిన మన్నన్ ఖాన్ ఓ ప్రకటనలో తెలిపారు. వీటిల్లో కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ద్వారా జాబ్ చేసే అవకాశాన్ని కూడా అందిస్తాయన్నారు.
ఫార్మా, ఐటీ, హెల్త్‌కేర్, విద్య, బ్యాంకింగ్ మరిన్నింటిలో ఉపాధి అవకాశాలను అందించే మెగా జాబ్ మేళా సెప్టెంబర్ 16న మెహదీపట్నంలోని కింగ్స్ ప్యాలెస్‌లో జరగనుంది. పదో తరగతి మొదలు ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు కూడా ఈ జాబ్‌మెళాలో పాల్గొనవచ్చు. అర్హత కలిగిన అభ్యర్ధులకు ప్రిలిమినరీ ఇంటర్వ్యూలు ఆన్-సైట్‌లో నిర్వహించబడతాయని నిర్వాహకుడు మన్నన్ ఖాన్ తెలిపారు.
SSC (10వ తరగతి) కనీస అర్హత ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ప్రవేశం పూర్తిగా ఉచితం. ఆసక్తిగల ఉద్యోగార్థులు మరిన్ని వివరాల కోసం 8374315052 నంబర్‌ను సంప్రదించవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.