పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్‌లో 456 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు (నవంబర్ 7) నుంచి ప్రారంభమైంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్/బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ(పోస్ట్ సర్టిఫికేట్)/బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్ బేసిక్), జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసకోవచ్చు. సంబంధిత పనిలో రెండేళ్ల పని అనుభవం కూడా ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు డిసెంబర్ 1, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే జనరల్ అభ్యర్ధులు రూ.1500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.1200లు అప్లికేషన్ ఫీజుగా దరఖాస్తు సమయంలో చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. డిసెంబర్ 18న రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.44,900ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.