JEE Main 2023: రేపట్నుంచే జేఈఈ మెయిన్‌-2023 తొలివిడత పరీక్షలు.. పరీక్ష రోజున ఈ పొరబాట్లు అస్సలు చేయకండి..

|

Jan 23, 2023 | 8:56 PM

దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రతిష్టాత్మ ఎంట్రన్స్ టెస్ట్ జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్ష మంగళవారం (జనవరి 23) ప్రారంభం కానుంది. ఈ పరీక్షకు సంబంధించి..

JEE Main 2023: రేపట్నుంచే జేఈఈ మెయిన్‌-2023 తొలివిడత పరీక్షలు.. పరీక్ష రోజున ఈ పొరబాట్లు అస్సలు చేయకండి..
JEE Mains 2023
Follow us on

దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రతిష్టాత్మ ఎంట్రన్స్ టెస్ట్ జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్ష మంగళవారం (జనవరి 23) ప్రారంభం కానుంది. ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా విడుదలయ్యాయి. ఇంకా అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోని విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌  నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇకపరీక్ష నిర్వహిణకు ఎన్‌టీఏ సర్వం సిద్ధం చేసింది. రేపటి నుంచి జనవరి 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో 290 నగరాల్లో, దేశం వెలుపలి 25 నగరాల్లో జేఈఈ మెయిన్‌ పరీక్ష జరగనుంది.

పరీక్ష హాలుకు వెళ్లే ముందు విద్యార్ధులు పాటించవల్సిన విధివిధానాలను ఎన్టీఏ విడుదల చేసింది. అడ్మిట్‌ కార్డుతోపాటు పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, ఆధార్‌ కార్డు, రేషన్‌కార్డు లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డు, అభ్యర్థి ఫొటో ఉన్న బ్యాంకు పాసు పుస్తకం.. వంటి ఏదైనా ఫొటో ఐడీ కార్డు తప్పకుండా తీసుకెళ్లాలి. అలాగే పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో ఒకటి, బాల్‌ పాయింట్‌ పెన్‌, దివ్యాంగ విద్యార్థులు పీడబ్ల్యూడీ సర్టిఫికెట్‌ను తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవి కాకుండ మరెలాంటి వస్తువులను కూడా పరీక్షహాలులోకి అనుమతించబోమని ఎన్టీఏ సూచించింది. పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా వెంట తీసుకెళ్లాల్సిన వాటిని ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోవాలని, చివరి నిమిషంలో హడావుడిగా కాకుండా ముందుగానే చేరుకొనేలా ప్లాన్‌ చేసుకోవాలని విద్యార్ధులకు సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.