JEE: విద్యార్థులకు అలర్ట్.. అప్లికేషన్ ఫీజులు భారీగా పెంపు.. ఎవరికి ఎంతంటే..

|

Dec 17, 2022 | 12:26 PM

జేఈఈ మెయిన్‌ అప్లికేషన్ ఫీజు భారీగా పెరిగింది. ఈ మేరకు ఫీజులు పెంచుతూ ఎన్టీఏ (జాతీయ పరీక్షల సంస్థ) ఉత్తర్వులు ఇచ్చింది. జనరల్‌, ఓబీసీ అమ్మాయిలకు ఏకంగా రూ.325 నుంచి రూ.800లకు పెంచడం గమనార్హం....

JEE: విద్యార్థులకు అలర్ట్.. అప్లికేషన్ ఫీజులు భారీగా పెంపు.. ఎవరికి ఎంతంటే..
TSPSC Application
Follow us on

జేఈఈ మెయిన్‌ అప్లికేషన్ ఫీజు భారీగా పెరిగింది. ఈ మేరకు ఫీజులు పెంచుతూ ఎన్టీఏ (జాతీయ పరీక్షల సంస్థ) ఉత్తర్వులు ఇచ్చింది. జనరల్‌, ఓబీసీ అమ్మాయిలకు ఏకంగా రూ.325 నుంచి రూ.800లకు పెంచడం గమనార్హం. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అబ్బాయిలకు రూ.650 నుంచి రూ.వెయ్యి.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.325 నుంచి రూ.500 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే జేఈఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. దాదాపు 11లక్షల మంది ఈ పరీక్షకు అప్లై చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది పరీక్ష రాస్తారు. ఇప్పుడు పెరిగిన ఫీజు వీరికి భారంగా మారనుంది. జేఈఈ మెయిన్స్ తో పాటు బీఆర్క్‌, బీ ప్లానింగ్‌లో చేరేందుకు నిర్వహించే పేపర్‌-2కు కూడా ఫీజును పెంచారు. ఈ నిబంధనలు విదేశీయులకూ వర్తిస్తాయి. అంతకుముందు అమ్మాయిలకు రూ.1,500, అబ్బాయిలకు రూ.3 వేలు ఉండగా…. ఈసారి అది వరసగా రూ.4 వేలు, రూ.5 వేలు అయింది.

కాగా.. జేఈఈ మెయిన్‌ 2023 షెడ్యూల్‌ విడుదలైంది. ఇంజినీరింగ్‌ విద్యా సంస్థల్లో బీటెక్‌ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తుంటారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు గురువారం నుంచి జనవరి 12వ తేదీ రాత్రి తొమ్మిది గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. Jeemain.nta.nic.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్‌ ఫస్ట్‌ ఫేజ్‌ పరీక్ష వచ్చే నెల 24,25,27,28,29,30,30 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక సెకండ్ ఫేజ్‌ పరీక్షలను ఏప్రిల్‌ 6,7,8,9,10,11,12 తేదీల్లో నిర్వహిస్తారు.

పరీక్షను ఎన్టీఏ మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు. వీటిలో ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, అసోమీ, బెంగాలీ, గుజ‌రాతీ, క‌న్నడ, మ‌ల‌యాళం, మ‌రాఠీ, పంజాబీ, త‌మిళం, ఉర్దూ, ఒడియా భాషలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..