MCL Recruitment: మహానది కోల్‌ఫీల్డ్స్‌లో భారీగా ఉద్యోగాలు.. అర్హత ఏంటంటే.
మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఒడిశా రాష్ట్రం బుర్లా, జాగృతి విహార్‌లోని కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మహానది కోల్‌ఫీల్డ్స్‌లో పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం...
మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఒడిశా రాష్ట్రం బుర్లా, జాగృతి విహార్‌లోని కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మహానది కోల్‌ఫీల్డ్స్‌లో పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 295 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 295 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జూనియర్ ఓవర్‌మ్యాన్ (82), మైనింగ్ సర్దార్ (145), సర్వేయర్ (68) పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2, డిప్లొమా/ డిగ్రీ (మైనింగ్/ మైన్ సర్వేయింగ్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
* అభ్యర్థుల వయసు 23-01-2023 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిన పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* జూనియర్ ఓవర్‌మ్యాన్/ మైనింగ్ సిర్దార్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.31,852.56, సర్వేయర్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.34,391 జీతంగా చెల్లిస్తారు.
* ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 03-01-2023 తేదీన మొదలై 23-01-2023తో ముగియనుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..