JEE Main 2026 Result Date: జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల తేదీ ఇదే.. ఒకట్రెండు రోజుల్లోనే ఆన్సర్‌ కీ విడుదల

ఎన్ఐటీల్లో, టాప్‌ ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌లో చేరేందుకు, ఐఐటీల్లో చేరేందుకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామినేషన్‌కు అర్హత పొందేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌ 1 పరీక్షలు గురువారం (జనవరి 29)తో విజయవంతంగా ముగిశాయి. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్‌ పేపర్‌ 1 పరీక్షలు జరగగా..

JEE Main 2026 Result Date: జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల తేదీ ఇదే.. ఒకట్రెండు రోజుల్లోనే ఆన్సర్‌ కీ విడుదల
JEE Main Result 2026 Session 1 Result Date

Updated on: Jan 30, 2026 | 7:57 AM

హైదరాబాద్‌, జనవరి 30: దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీల్లో, టాప్‌ ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌లో చేరేందుకు, ఐఐటీల్లో చేరేందుకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామినేషన్‌కు అర్హత పొందేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌ 1 పరీక్షలు గురువారం (జనవరి 29)తో విజయవంతంగా ముగిశాయి. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్‌ పేపర్‌ 1 (బీఈ/బీటెక్‌) పరీక్ష జరిగింది. ఇక జనవరి 29న పేపర్‌ 2ఎ (బీఆర్క్‌), పేపర్‌ 2బి (బీప్లానింగ్‌) పరీక్షలను ఎన్‌టీఏ నిర్వహించింది. తొలి రోజుల్లో పరీక్షల కాఠిన్యం అధికంగా ఉంటే.. పరీక్షల చివరి రోజు వచ్చేటప్పటికీ అత్యంత సులభంగా ప్రశ్నాపత్రాలు రావడం గమనార్హం. చివరి రోజు పరీక్ష మిగిలిన రోజుల పేపర్లతో పోలిస్తే కొంచెం సులభంగా ఉన్నాయని విద్యార్ధులు తెలిపారు. ముఖ్యంగా జేఈఈ మెయిన్ 2026 పరీక్షల్లో సెషన్ 5 వ రోజు బుధవారం రెండో షిఫ్ట్ లో జరిగిన పరీక్ష ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షలతో పోలిస్తే సులభంగా ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

ఇక జేఈఈ మెయిన్‌ ప్రాథమిక ఆన్సర్‌ కీ ఫిబ్రవరి మొదటి వారంలో విడులయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరాల ట్రెండ్‌ ప్రకారం పరీక్షలు ముగిసిన ఐదు రోజుల వ్యవధిలోనే ప్రాధమిక ఆన్సర్‌ కీ విడుదల చేస్తున్నారు. ఆ ప్రకారంగా చూస్తే ఫిబ్రవరి మొదటి వారంలో ఆన్సర్‌ కీతోపాటు రెస్సాన్స్‌షీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఫైనల్‌ కీ ఖరారుచేసి ఫలితాలు విడుదల చేస్తారు. షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 12 నాటికి జేఈఈ మెయిన్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. వీలైతే ఫిబ్రవరి 12కు ముందే ఫలితాలు వెల్లడించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ భావిస్తుంది. కాగా జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 13.5 లక్షల మందికి పైగా అంటే 95 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు సమాచారం.

జేఈఈ మెయిన్‌ 2026 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఇక జేఈఈ మెయిన్‌ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌ మలి విడత ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 3వ వారం నాటికి దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. అప్లికేషన్ కరెక్షన్‌ విండో ఫిబ్రవరి చివరి వారంలో ఓపెన్‌ అవుతుంది. ఇక జేఈఈ మెయిన్‌ మలి విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. సెషన్‌ 1 పరీక్షలు రాసిన వారు సెషన్‌ 2కి కూడా దరఖాస్తు చేసుకుని పరీక్షలు రాయవచ్చు. ఈ రెండు విడతల్లో బెస్ట్ స్కోర్‌ను అంతిమంగా పరిగణనలోకి తీసుకుంటారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.