JEE Main 2025 First Session: నవంబర్‌ నుంచి జేఈఈ మెయిన్‌ తొలివిడత రిజిస్ట్రేషన్లు.. పరీక్ష ఎప్పుడంటే?

|

Sep 11, 2024 | 11:32 AM

దేశంలోని ప్రతి ష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో బీటెక్‌, బీ ప్లానింగ్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌-2025 రిజిస్ట్రేషన్‌ నవంబర్‌ నుంచి ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్ష జనవరి చివరివారంలో జరగనుంది. ఇక తుది విడత పరీక్ష ఏప్రిల్‌ మొదటి వారంలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ..

JEE Main 2025 First Session: నవంబర్‌ నుంచి జేఈఈ మెయిన్‌ తొలివిడత రిజిస్ట్రేషన్లు.. పరీక్ష ఎప్పుడంటే?
JEE Main 2025
Follow us on

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 11: దేశంలోని ప్రతి ష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో బీటెక్‌, బీ ప్లానింగ్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌-2025 రిజిస్ట్రేషన్‌ నవంబర్‌ నుంచి ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్ష జనవరి చివరివారంలో జరగనుంది. ఇక తుది విడత పరీక్ష ఏప్రిల్‌ మొదటి వారంలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) వారం, పదిరోజుల్లో విడుదల చేయనుంది. జేఈఈ మొదటి విడత రిజిస్ట్రేషన్‌ నవంబర్‌ నుంచే ప్రారంభం కానుంది. కాగా గతేడాది జేఈఈ మెయిన్‌ సిలబస్‌లో పలు మార్పులు చేశారు. దీంతో ఈ ఏడాది సిలబస్‌లో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. జేఈఈ మెయిన్‌ పరీక్ష మొత్తం 300 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు ఆన్‌లైన్‌ విధానంలో మూడు గంటల పాటు నిర్వహిస్తారు.

సెప్టెంబర్‌ 15 వరకు తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్ల గడువు

తెలంగాణ రాష్ట్రంలోని జూనియ‌ర్ కాలేజీల్లో ప్రవేశాల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు మ‌రోమారు తుది గ‌డువు పొడిగించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సెప్టెంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు ప్రవేశాలకు గ‌డువును పొడిగించింది. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో ప్రవేశాలు పొందేందుకు ఇదే చివ‌రి అవకాశమని, అర్హులైన విద్యార్థులు ఈ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్‌ బోర్డు అధికారులు సూచించారు. ఇక ఇంట‌ర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో అడ్మిషన్లు పొందగోరే విద్యార్ధులు.. ఇంట‌ర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న పదో తరగతి మార్క్స్ మెమో, ఆధార్ కార్డుతోపాటు ఇతర ధృవీకరణ పత్రాలను సమసర్పించవల్సి ఉంటుంది. ప్రొవిజిన‌ల్ అడ్మిష‌న్ పూర్తయిన త‌ర్వాత క‌చ్చితంగా ఒరిజిన‌ల్ మెమోతో పాటు టీసీని కళాశాల యాజమన్యానికి స‌మ‌ర్పించవల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ఇంట‌ర్మీడియట్ వెబ్‌సైట్‌లో పొందుప‌రిచిన సంగతి తెలిసిందే. ఆ జాబితా ఆధారంగా అడ్మిష‌న్లు పొందొచ్చని విద్యార్థుల‌కు సూచించారు.

టీజీపీఎస్సీ లైబ్రేరియన్‌ పోస్టుల ఎంపిక జాబితా విడుదల

తెలంగాణ సాంకేతిక, కళాశాల విద్య కమిషనరేట్‌ పరిధిలో లైబ్రేరియన్‌ పోస్టులకు సంబంధించిన ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 64 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇతర సమాచారం కోసం టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.