దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రతిష్టాత్మ ఎంట్రన్స్ టెస్ట్ జేఈఈ మెయిన్ రెండో విడత (సెషన్ -2)కు సంబంధించి అడ్మిట్ కార్డులు సోమవారం (ఏప్రిల్ 3) విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.nta.ac.in, https://jeemain.nta.nic.in నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్ధి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ (సెషన్ 2) అడ్మిట్‌కార్డల డౌన్‌లోడ్‌లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ఎన్టీఏ హెల్ప్‌లైన్ నంబర్ 011-40759000 నంబర్‌ను ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించవచ్చు.
ఏప్రిల్ 6,8,10,11,12,13, 15 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 330 నగరాల్లో, 15 విదేశీ నగరాల్లోనూ ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. దాదాపు 9.4 లక్షలకుపైగా విద్యార్ధులు ఈ పరీక్ష రాయనున్నారు. జేఈఈ మెయిన్‌లో టాప్ స్కోరు సాధించే రెండున్నర లక్షల మంది విద్యార్థులు జూన్ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.