JEE Main 2021 Result: జేఈఈ మెయిన్ ఫలితాలు.. మొదటి ర్యాంకులతో మెరిసిన తెలుగు విద్యార్థులు..
JEE Main Result released: దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. జేఈఈ మెయిన్ (నాలుగో విడత) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం అర్థరాత్రి విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం
JEE Main Result released: దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. జేఈఈ మెయిన్ (నాలుగో విడత) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం అర్థరాత్రి విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం 44 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. 18 మంది విద్యార్థులు మొదటి ర్యాంకు సాధించినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లు jeemain.nta.nic.in, nta.ac.in, ntaresults.nic.inలో చూసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా.. ఈ ఫలితాల కోసం పరీక్షకు హాజరైన అభ్యర్థులు మూడు రోజుల నుంచి నిరీక్షిస్తున్నారు. కాగా.. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆరుగురు విద్యార్థులు మొదటి ర్యాంకు సాధించారు. ఏపీ నుంచి దుగ్గినేని వెంకట పనీష్, పసల వీరశివ, కాంచనపల్లి రాహుల్ నాయుడు, కరణం లోకేష్ మొదటి ర్యాంకు సాధించగా.. తెలంగాణ నుంచి కొమ్మ శరణ్య, జోస్యుల వెంకట ఆదిత్య మొదటి ర్యాంకులో నిలిచారు.
National Testing Agency (NTA) releases JEE Main results; 44 candidates get 100 percentile, 18 candidates on rank 1 pic.twitter.com/GO8vEfaZCd
— ANI (@ANI) September 14, 2021
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in, DigiLocker లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. దీనిలో ప్రధాన ఫలితం, NTA స్కోర్ కార్డ్ కూడా అందుబాటులో ఉంటుంది. పరీక్ష నాల్గవ సెషన్‌ను ఎంచుకొని.. రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే ఫలితం కనిపిస్తుంది. అనంతరం స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి.
కాగా.. జేఈఈ మెయిన్ పరీక్షలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరు కావడం ఇదే మొదటిసారి. సెషన్ 4 కోసం మొత్తం 7.32 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఏడాదికి నాలుగు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సెషన్ 1 లో, మొత్తం 6.61 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా.. సెషన్ 2, 6.19 లక్షల మంది, సెషన్ 3 లో, 7.09 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా 13 భాషలలో నిర్వహిస్తారు.
Also Read: