JEE Mains 2021 Result: జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల.. సులువుగా ఇలా చెక్ చేసుకోండి..
NTA JEE Main 2021 session 4: ఐఐటీల్లో బీఈ, బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ
NTA JEE Main 2021 session 4: ఐఐటీల్లో బీఈ, బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదలయ్యాయి. ఈ మేరకు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ట్విట్ చేసి వెల్లడించింది. జేఈఈ నాలుగో విడుత పర్సంటైల్‌తోపాటు అభ్యర్థుల తుది ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. దీంతోపాటు కటాఫ్ మార్కులను కూడా విడుదల చేసింది. విద్యార్థులు ర్యాంకుల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
JEE Main results to be declared today: Ministry of Education pic.twitter.com/kX8yW1riHo
— ANI (@ANI) September 14, 2021
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in, DigiLocker లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. దీనిలో ప్రధాన ఫలితం, NTA స్కోర్ కార్డ్ కూడా అందుబాటులో ఉంటుంది. పరీక్ష నాల్గవ సెషన్‌ను ఎంచుకొని.. రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే ఫలితం కనిపిస్తుంది. అనంతరం స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి.
#JEEMains2021 results to be declared today: @EduMinOfIndia
— All India Radio News (@airnewsalerts) September 14, 2021
ఇదిలావుంటే.. ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే JEE అడ్వాన్స్‌డ్ 2021 పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి (సెప్టెంబర్ 11) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. JEE మెయిన్ ర్యాంకుల వెల్లడిలో ఆలస్యం కావడంతో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వాయిదా వేశారు.
Also Read: