IUCTE Non Teaching Recruitment 2022: వారణాసిలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (IUCTE).. 31 నాన్ టీచింగ్ స్టాఫ్ (Group ‘A, B, C) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, సెక్షన్ ఆఫీసర్ (అడ్మినిస్ట్రేషన్), ప్రైవేట్ సెక్రటరీ, అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), ఎడిటర్, వెబ్ మాస్టర్, ఇంజనీర్ (హార్డ్‌వేర్), సిస్టమ్ అనలిస్ట్ , మీడియా అండ్ కమ్యూనికేషన్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆఫీసర్ పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి/ఇంటర్/సంబంధిత విభాగాల్లో యూజీ డిగ్రీ/పీజీ డిగ్రీ/డిప్లొమా (కంప్యూటర్/ఎలక్ట్రానిక్/కమ్యునికేషన్), బీఈ/బీటెక్(ఎలక్ట్రానిక్స్/ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్ లేదా మాస్ కమ్యునికేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 35 నుంచి 56 యేళ్ల మధ్య ఉండాలి.
అకడమిక్ మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుముగా గ్రూప్ ‘ఏ’ పోస్టులకు రూ.1000లు, గ్రూప్ ‘బీ’ పోస్టులకు రూ.500ల వరకు తప్పనిసరిగా చెల్లించాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 31, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం నింపిన దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా సెప్టెంబర్ 8, 2022 లోపు పంపించాలి. ఎంపికైనవారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.78,800ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ను చెక్ చేసుకోండి.
అడ్రస్: The Sr. Administrative Officer, Inter University Centre for Teacher Education (IUCTE), Sundar Bagia, Naria – BLW Road, BHU, Varanasi-221005, U.P.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.