
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)కు చెందిన కేరళలోని తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC).. పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మెడికల్ ఆఫీసర్, డెంటల్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 7, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి 70 ఏళ్లకు మించకూడదు. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో ఈమెయిల్ ద్వారా డిసెంబర్ 7, 2025వ తేదీలోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు.
ఈమెయిల్ ఐడీ: hsshelp@vssc.gov.in
విక్రమ్ సారాబాయ్ స్సెస్ సెంటర్ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.