ISRO: టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి పలు సంస్థలు. తాజాగా ఇండియన్స్పేస్రిసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) రెండు ఉచిత కోర్సులను ప్రారంభించింది. ఇస్రో పరిధిలోని డెహ్రాడూన్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ఆఫ్ రిమోట్సెన్సింగ్ (IIRS).. రిమోట్ సెన్సింగ్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్సిస్టమ్పై ఆన్‌లైన్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉచిత ఆన్‌లైన్ కోర్సులు మొత్తం 12 రోజుల్లో పూర్తవుతాయి. ఈ కోర్సులు వ్యవసాయం, నేల, అటవీ, జీవావరణ శాస్త్రం, జియోసైన్స్, భౌగోళిక ప్రమాదాలు, మెరైన్ అట్మాస్పియర్రిమోట్ సెన్సింగ్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అప్లికేషన్లపై అవగాహన కల్పిస్తాయి. పట్టణాలు, నగరాల్లో నీటి వనరులు ఆవశ్యకతను తెలియజేస్తాయి.
40 శాతం ఉత్తీర్ణత మార్కులు..
ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కేంద్ర, లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే టెక్నికల్ లేదాసైంటిఫిక్స్టాఫ్, యూనివర్సిటీల పరిధిలోని పరిశోధకులు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. కోర్సులో భాగంగా కనీసం 70 శాతం హాజరు, 40 శాతం ఉత్తీర్ణత మార్కులు సాధించిన వారికి మాత్రమే ఇస్రో (ISRO) నుంచి పార్టిసిపెంట్సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ కోర్సును నవంబర్8 నుంచి నవంబర్ 26 వరకు నిర్వహిస్తారు.
ఆన్‌లైన్ కోర్సుల్లో ఎలాంటి టాపిక్స్ ఉంటాయి..
పంటలను అంచనా వేయడం, పర్యవేక్షించడం. రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ అప్లికేషన్, అలాగే రిమోట్ సెన్సింగ్, జియోలాజికల్ స్టడీస్‌తో కోస్టల్ జోన్ మేనేజ్మెంట్. రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ల సహాయంతో భూగర్భ అధ్యయనం. ఇక విపత్తు నిర్వహణకు అవసరమయ్యే స్పేస్-ఎనేబుల్డ్ ప్రొడక్ట్స్ , సర్వీసులను తెలియజేయడం. అర్బన్ ప్రాంతాల్లో రిమోట్ సెన్సింగ్ వ్యవస్థ అమలుపై అవగాహనపై ఉంటుంది. వాతావరణ, సముద్ర పర్యావరణానికి రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ లాంటివి ఉంటాయి.
ఎలా దరఖాస్తు చేయాలి?
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లెక్చర్ స్లైడ్‌లు, వీడియో-రికార్డెడ్ లెక్చర్‌లు, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్, హాండ్అవుట్డెమాన్స్ట్రేషన్వంటి పద్దతుల్లో కోర్సు స్టడీ మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువస్తారు.
ఇవి కూడా చదవండి: