AYUSH Recruitment: ఆయుష్‌ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

AYUSH Recruitment 2021: భారత ప్రభుత్వానికి చెందిన ఆయుష్‌ మంత్రిత్వ శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం..

AYUSH Recruitment: ఆయుష్‌ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Ayush Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 02, 2021 | 12:03 PM

AYUSH Recruitment 2021: భారత ప్రభుత్వానికి చెందిన ఆయుష్‌ మంత్రిత్వ శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది, ఈనెల 10తో ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 07 ఖాళీలకుగాను సీనియర్‌ ప్రోగ్రాం మేనేజర్ (టెక్నికల్‌) – 01, జూనియర్‌ ప్రోగ్రాం మేనేజర్‌ (టెక్నికల్‌)-02, ప్రోగ్రాం మేనేజర్‌ (అడ్మినిస్ట్రేటివ్‌) – 02, డేటా అసిస్టెంట్‌ – 01, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ – 01 భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖాళీలను అనుసరించి ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, రీసెర్చ్‌ కౌన్సిల్‌, ప్రభుత్వరంగ సంస్థల్లో మూడేళ్లు పనిచేసి అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 50 ఏళ్ల లోపు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులు పోస్టులను అనుసరించి నెలకు రూ. 16,000 నుంచి రూ. 75,000 వరకు లభిస్తుంది.

* ఎంపికైన అభ్యర్థులకు 2022 మార్చి 31 వరకు కాంట్రాక్ట్‌ గడువుతో పనిచేయాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో ఫామ్‌ ఫిల్‌ చేసి, దరఖాస్తుతో పాటు అవసరమైన డ్యాక్యుమెంట్స్‌ జత చేసి ఆఫ్‌లైన్‌లో పంపించాలి.

* దరఖాస్తులను అసిస్టెంట్‌ అడ్వైజర్‌, చాంపియన్‌ సర్వీస్‌ సెక్టార్‌ స్కీమ్‌, రూమ్‌ నెం 8, ఆయుష్‌ భవన్‌, న్యూఢిల్లీ 110023 అడ్రస్‌కు పంపించాలి.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Festival Season Effect: అక్టోబర్‌లో ఫాస్టాగ్‌ వసూళ్లు ఎంత పెరిగాయంటే..

Cyber Crime: పెళ్లి సంబంధం పేరుతో టోకరా.. రూ.17.90 లక్షలు కాజేసిన వైనం..

Viral News: కిలో స్వీట్ ధర రూ. 11,000.. ఏంటి బంగారంతో చేస్తారంటారా.? అవును నిజమే..

33 ఏళ్లుగా అరుదైన నాణేలను సేకరిస్తున్న ఏపీ వ్యక్తి..
33 ఏళ్లుగా అరుదైన నాణేలను సేకరిస్తున్న ఏపీ వ్యక్తి..
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
మ్యాడ్ స్క్వేర్ నుంచి 'స్వాతి రెడ్డి' సాంగ్ వచ్చేసిందోచ్..
మ్యాడ్ స్క్వేర్ నుంచి 'స్వాతి రెడ్డి' సాంగ్ వచ్చేసిందోచ్..
ట్రైన్‌‌ స్లీపర్ భోగీలో గుప్పుమన్న వింతైన వాసన..
ట్రైన్‌‌ స్లీపర్ భోగీలో గుప్పుమన్న వింతైన వాసన..
20 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిస్తోంది.. గ్లామర్ సెన్సేషన్..
20 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిస్తోంది.. గ్లామర్ సెన్సేషన్..
ఆసీస్ గడ్డపై టాలీవుడ్ హీరోలను గుర్తు చేసిన నితీశ్ రెడ్డి
ఆసీస్ గడ్డపై టాలీవుడ్ హీరోలను గుర్తు చేసిన నితీశ్ రెడ్డి
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
అలా ఉన్నా డయాబెటిస్ బారిన పడతారంట.. షాకింగ్ విషయాలు..
అలా ఉన్నా డయాబెటిస్ బారిన పడతారంట.. షాకింగ్ విషయాలు..
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
ప్రతి 10 నిమిషాలకు రూ.50 లక్షలు విలువ చేసే లగ్జరీ కారు అమ్మకం..!
ప్రతి 10 నిమిషాలకు రూ.50 లక్షలు విలువ చేసే లగ్జరీ కారు అమ్మకం..!