IREDA Recruitment 2022: నెలకు రూ.280000ల జీతంతో కేంద్ర కొలువులు పొందే అవకాశం! బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు..

|

Sep 27, 2022 | 9:03 AM

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన ఇండియన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ లిమిటెడ్‌ (IREDA).. 21 జనరల్‌ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ తదితర (General Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

IREDA Recruitment 2022: నెలకు రూ.280000ల జీతంతో కేంద్ర కొలువులు పొందే అవకాశం! బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు..
IREDA Recruitment 2022
Follow us on

IREDA General Manager Recruitment 2022: భారత ప్రభుత్వ విభాగానికి చెందిన ఇండియన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ లిమిటెడ్‌ (IREDA).. 21 జనరల్‌ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ తదితర (General Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకును అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజినీరింగ్‌)/సీఏ/సీఎంఏ/పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి 45 నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 21, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. జనరల్ అభ్యర్ధులు రూ.1000లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.70,000ల నుంచి రూ.2,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.