IPPB Manager Recruitment 2022: భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) దేశ వ్యాప్తంగాఉన్న వివిధ శాఖల్లో.. రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన 13 ఏజీఎం, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ తదితర (AGM Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ, డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. సెప్టెంబర్ 1, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 23 నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి. వయోపరిమితి విషయంలో రిజర్వేషన్ వర్తిస్తుంది. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 24, 2022వ తేదీ అర్థరాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.750, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులు రూ.150లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్/ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హులైన వారికి నెలకు రూ.1,12,000ల నుంచి రూ.3,50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.