IOCL Recruitment: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో భారీగా అప్రెంటిస్‌ పోస్టులు.. అర్హులు ఎవరంటే..

|

Oct 02, 2022 | 4:48 PM

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. వివిధ విభాగాల్లో ఉన్న అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఏకంగా 1535 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

IOCL Recruitment: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో భారీగా అప్రెంటిస్‌ పోస్టులు.. అర్హులు ఎవరంటే..
Indian Oil Corporation Limited
Follow us on

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. వివిధ విభాగాల్లో ఉన్న అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఏకంగా 1535 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1535 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ట్రేడ్‌ అప్రెంటిస్‌ అట్టెండెంట్‌ ఆపరేటర్‌ (396), ఫిట్టర్‌ (161), బాయిలర్‌ (54), డాటాఎంట్రీ ఆపరేటర్‌ (73), సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ (39), అకౌంటెంట్‌ (45), టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ మెకానికల్‌ (361), కెమికల్‌ (332), ఎలక్ట్రికల్‌ (198), ఇన్‌స్ట్రుమెంటేషన్‌ (74) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీ, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్‌ 23ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…