భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పైప్‌లైన్ డివిజన్‌లో.. 465 టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మెకానికల్, ఎలక్ట్రికల్, టీ అండ్ ఐ, హ్యూమన్ రీసోర్స్, అకౌంట్స్/ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంటర్మీడియట్, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు నవంబర్ 10, 2022వ తేదీ నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 30, 2022వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రాత పరీక్ష డిసెంబర్ 18 నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ప్రతి నెలా స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.